బడి భవనంలోనే అంగన్‌వాడీ.. పంచాయతీ | - | Sakshi
Sakshi News home page

బడి భవనంలోనే అంగన్‌వాడీ.. పంచాయతీ

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

బడి భ

బడి భవనంలోనే అంగన్‌వాడీ.. పంచాయతీ

దండేపల్లి: మండలంలోని జైతుగూడ గిరిజన సంక్షేమ శాఖ దిశ మోడల్‌ స్కూల్‌ భవనంలోనే అంగన్‌వాడీ కేంద్రం, పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. పాఠశాలకు రెండు భవనాలు, మూడు గదులు ఉండగా.. ఓ గదిలో బడి, మరో గదిలో అంగన్‌వాడీ కేంద్రం, ఇంకో గదిలో రాజుగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగిస్తున్నారు. తాళ్లపేట గ్రామ పంచాయతీ పరిధిలో రాజుగూడ, జైతుగూడ, నాయికపుగూడ, తట్రగూడెం, కుంటలగూడ, కుంటలగూడ కట్ట ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో రాజుగూడను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి దీని పరిధిలోకి జైతుగూడ, నాయికపుగూడ, తట్రగూడెం, కుంటలగూడ, కుంటలగూడకట్ట గ్రామాలను చేర్చారు. పంచాయతీ కార్యాలయానికి భవనం లేకపోవడంతో జైతుగూడలోని పాఠశాలకు చెందిన ఓ భవనం కేటాయించారు. ఏళ్లుగా పాఠశాల భవనంలోనే పంచాయతీ, అంగ్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పంచాయతీ సమావేశాల సమయంలో విద్యార్థులు, అంగన్‌వాడీ పిల్ల లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠశాల ఆవరణలో పంచాయతీ ట్రాక్టర్‌, కార్యాలయానికి వచ్చేవారి వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. దీంతో పిల్లలు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.

కొత్తభవనంలోకి మార్చరా..!

రాజుగూడ పంచాయతీ కార్యాలయానికి జైతుగూడలో ఏడాది క్రితమే ఉపాధి నిధులతో కొత్తభవనం నిర్మించారు. పూర్తయి ఏడాది గడుస్తున్నా కార్యాలయాన్ని అందులోకి మార్చడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్యాలయాన్ని కొత్త భవనంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

బడి భవనంలోనే అంగన్‌వాడీ.. పంచాయతీ1
1/1

బడి భవనంలోనే అంగన్‌వాడీ.. పంచాయతీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement