మొదట ఇక్కడే..
ఏడు మండలాల్లో మలి విడత పంచాయతీ ఎన్నికలు
111 గ్రామాలు, 873 వార్డులు
సర్పంచుల బరిలో 336 మంది, వార్డుల్లో 1,948మంది
బందోబస్తు విధుల్లో 996 మంది పోలీసులు
భీమిని: బస్సులో నిలబడి వెళ్తున్న సిబ్బంది
భీమిని: నాయకునిపేటలో ప్రజలు, యువకులతో మాట్లాడుతున్న డీసీపీ భాస్కర్
బెల్లంపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆయా మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను కాసిపేట మండలం ధర్మరావుపేట, కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇక మిగతా 111 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుండగా.. 336మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 996వార్డు సభ్యుల స్థానాలకు గాను 16చోట్ల నామినేషన్లు రాలేదు. 111మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 873 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. 1,948మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
పోలింగ్ సామగ్రి
పంపిణీ
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను అధికారులు సిబ్బందికి శనివారం మధ్యాహ్నం నుంచి పోలింగ్ సామగ్రి అందజేశారు. ఆయా మండలాల్లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల ఉత్తర్వుల కాపీలు పంపిణీ చేశారు. బెల్లంపల్లిలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా ఎన్నికల పర్యవేక్షకుడు మనోహర్ సందర్శించి పోలింగ్ అధి కారులకు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ అధికారులు, సిబ్బందికి తమకు కేటాయించిన గ్రామాలకు పోలీసు బందోబస్తుతో తరలివెళ్లారు. డీటీవో గోపికృష్ణ పర్యవేక్షణలో ఎంవీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 80బస్సులు, 33 కార్లు, 25టాటా ఏస్ వాహనాలు సమకూర్చారు.
అధికారుల నియామకం..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ నిర్వహణకు డివిజన్ వ్యాప్తంగా 1,147మంది ప్రిసైడింగ్ అధికారులు(పీవో), 1,363 మంది ఓపీవోలు, 48మంది స్టేజ్–2 ఆర్‌వోలు, ఐదుగురు మైక్రో అబ్జర్వర్లు, 30మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బంది, ఇతరులతో కలిపి మొత్తంగా 2,630మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొననున్నారు. బెల్లంపల్లి మండలంలో 179మంది పీవోలు, 200మంది ఓపీవోలు, భీమినిలో 115మంది పీవోలు, 115ఓపీవోలు, కన్నెపల్లిలో 150మంది పీవోలు, 162మంది ఓపీవోలు, కాసిపేటలో 219మంది పీవోలు, 276మంది ఓపీవోలు, నెన్నెలలో 182మంది పీవోలు, 207మంది ఓపీవోలు, తాండూర్‌లో 166మంది పీవోలు, 242మంది ఓపీవోలు, వేమనపల్లి మండలంలో 136మంది పీవోలు, 161మంది ఓపీవోలు విధులు నిర్వర్తించనున్నారు.
39 రూట్లు.. 996 మందితో బందోబస్తు..
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నా రు. 39 రూట్లలో నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 950 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్‌డ్, ఏఆర్, ప్రత్యేక పోలీసులతో కలిపి 996 మంది ఎన్నికల బందోబస్తులో ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికలు పకడ్బందీగా
నిర్వహించాలి
బెల్లంపల్లిరూరల్/తాండూర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సాధారణ ఎన్నికల పర్యవేక్షకుడు మనోహర్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అధికారులకు సూచించారు. శనివారం బెల్లంపల్లి, తాండూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ నిర్ణీత సమయానికి ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు పారదర్శంగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో మహేందర్, ఎంఈవో పోచయ్య, ఎంపీవో శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ జ్యోత్స్న, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో అధికారులే కీలకం
నెన్నెల/వేమనపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికార పాత్ర కీలకమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. రెండో విడత ఎన్నికల నేపథ్యంలో నెన్నెల, వేమనపల్లిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. సామగ్రి పంపిణీపై సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. పూర్తి స్థాయి సామగ్రితో ఉద్యోగులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడంతోపాటు లెక్కింపు పూర్తయ్యాక తిరిగి వచ్చేలా రూట్ అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో నెన్నెల ఎంపీడీఓ అబ్దుల్‌హై, తహసీల్దార్ పిప్పిరి శ్రీనివాస్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ నరేష్, వేమనపల్లి ఎంపీడీవో కుమారస్వామి, డీటీ మస్కూర్‌ఆలీ, ఎంఈఓ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
బెల్లంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు విధిగా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోల్ చిట్టీతోపాటు గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం 18 రకాల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయవచ్చని సూచించింది.
కార్డులు ఇవే..
ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులను ప్రకటించింది. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, పీహెచ్‌సీ ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు ఐడీ కార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కో–ఆపరేటివ్ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, ప్రభుత్వం అందజేసిన హెల్త్‌కార్డు, కార్మిక శాఖ ఆరోగ్య బీమా పథకం కార్డు, వితంతువులు, మాజీ సైనికుల పింఛన్ పుస్తకం, వృద్ధుల పింఛన్ పత్రం, స్వాతంత్య్ర సమర యోధుల గుర్తింపు కార్డు, దివ్యాంగుల ధ్రువపత్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకుంటారు.
గుర్తింపు కార్డు చూపిస్తేనే ఓటు
నెన్నెల: పంచాయతీ ఎన్నికల్లో గొడవలు సృష్టించి, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ యువకులకు సూచించారు. శనివారం రాత్రి నెన్నెల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో సాయుధ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చౌరస్తాలో యువత, గ్రామస్తులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, నాయకులు సహకరించాలని అన్నారు. యువకులు గొడవలకు పాల్పడవద్దని, ఒకసారి ఎన్నికల సంబంధిత కేసు నమోదైతే భవిష్యత్‌లో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతీసారి వారిని బైండోవర్ చేస్తారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని అన్నారు. ఓటర్లు ప్రలోభాల కు లోనుకాకుండా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ర్యాలీలు, విజయోత్సవా లకు అవకాశం లేదన్నారు. ఏసీపీలు రవికుమార్, ప్రకాష్, ఎస్సైలు ప్రసాద్, సంతోష్ పాల్గొన్నారు.
జిల్లాలో 1,37,382మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 68,179మంది, మహిళలు 69,195 మంది, ఇతరులు 8మంది ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. తాండూర్ మండలం నీలాయపల్లిలో 292మంది, భీమిని మండలం లక్ష్మీపూర్‌లో 376 మంది, నెన్నెల మండలం జోగాపూర్‌లో 430 మంది, కాసిపేట మండలం తాటిగూడలో 435 మంది, బెల్లంపల్లి మండలం లింగాపూర్‌లో 461 మంది, దుగ్నెపల్లిలో 493 మంది ఓటర్లు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.
కాసిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ
నెన్నెల: పోలింగ్ సామగ్రితో బస్సులో గ్రామాలకు వెళ్తున్న అధికారులు, సిబ్బంది
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..
మొదట ఇక్కడే..


