కాసిపేట: తమ తండ్రి వెంకటస్వామి, తాను కార్మిక మంత్రిగా పని చేశామని, తన తమ్ముడు వివేక్ ప్రస్తుతం కార్మిక మంత్రిగా పని చేస్తున్నారని, తమ కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల వెన్నంటే ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. మంగళవారం మండలంలోని దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పూస్కూరి విక్రమ్‌రావు వెంట ఉంటామని, అతడిని గెలిపించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ అభ్యర్థి పూస్కూరి విక్రమ్‌రావు, నాయకులు తిరుపతిరెడ్డి, అడె జంగు, తదితరులు పాల్గొన్నారు.