
సాదాబైనామాలపై విచారణ
భీమారం: మండలంలోని పోతన్‌పల్లి గ్రామంలో సాదాబైనామా కింద పట్టా హక్కులు కల్పించాలనే ఽఅర్జీలపై రెవెన్యూ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. భూభార తి రెవెన్యూ సదస్సుల్లో పట్టాలు కావాలని దరఖాస్తు చేసుకున్న పోతన్‌పల్లి గ్రామానికి రెవెన్యూ అధికారులు తరలివెళ్లారు. అర్జీలు పెట్టుకున్న రైతులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన భూము ల వద్దకు వెళ్లి పంచనామా నిర్వహించిన అనంతరం వీడియో రికార్డు చేశారు. భూములు అమ్మిన రైతుల వాగ్మూలం తీసుకుని వారి సంతకాలు సేకరించారు. తహసీల్దార్ సదా నందం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సా దాబైనామాలను పట్టాలు చేసేందుకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ముందస్తుగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.