
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
బెల్లంపల్లి/తాండూర్: పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. అభినవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తాండూర్ మండ ల కేంద్రంలో మట్టి గణపతి ప్రతిమలు పంపి ణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోనూ మండల కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జోత్స్న, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎజాజుద్దీన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు దేవరకొండ రాజన్న, సంతోష్‌కుమార్, సిరంగి శంకర్, బాపురెడ్డి, ఉమ్రావ్‌సింగ్, కామని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి లో బుగ్గ రాజ రాజేశ్వరస్వామి దేవాలయం, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను సబ్ కలెక్టర్ పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమి టీ కన్వీనర్ నాతరి స్వామి, నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, కాంగ్రెస్ నాయకులు దూడం మహేష్, ముక్తా రాజన్న, బామండ్ల పల్లి భారత్, రాజేందర్, ఈవో బాపురెడ్డి, అర్చకులు సతీష్‌శర్మ పాల్గొన్నారు.