
మార్కెట్‌లో సందడి
మంచిర్యాల మార్కెట్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. గణేషుడి పూజకు అవసరమైన సామగ్రిని భక్తులు మంగళవా రం కొనుగోలు చేశారు. వినాయక పత్రి, పండ్లు, పూజా సామగ్రి విక్రయానికి రహదా రి పొడవునా తాత్కాలిక దుకాణాలు ఏర్పా టు చేశారు. ఎలిక్కాయలు, తామరపువ్వులు, మామిడి ఆకులు, ఉసిరి, సీతాఫలాలతోపాటు పలు రకాల పత్రి ఆకులను కొనుగోలు చేశారు. వినాయక పూజకు వినియోగించే 10నుంచి 20రకాల పూజసామగ్రికి రూ.100నుంచి రూ.150వరకు ధరలు పలి కాయి. మట్టి వినాయకుల అమ్మకాలు జోరుగా సాగాయి. నస్పూర్, మందమర్రి, జైపూ ర్, చెన్నూర్, హాజీపూర్, లక్సెటిపేట ప్రాంతాలకు వినాయకులను తరలించారు.