
న్యాయవాదులపై దాడులు హేయమైన చర్య
మంచిర్యాలక్రైం: న్యాయవాదులపై దాడులు హేయమైన చర్యగా జిల్లా బార్ అసోసియేష న్ అధ్యక్షుడు బండవరం జగన్ అభివర్ణించా రు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు తన్నీరు శ్రీకాంత్‌పై జరిగిన దాడిని ఖండించారు. మంగళవారం కోర్టులో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
లక్సెట్టిపేటలో..
లక్సెట్టిపేట: న్యాయవాది శ్రీకాంత్‌పై దాడికి నిరసనగా స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. ఇలాంటి సంఘటనలు పునరా వృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, కార్యదర్శి ప్రదీప్, న్యాయవాదులు పాల్గొన్నారు.