
బీసీ రిజర్వేషన్ల సాధనకు రిలే నిరాహార దీక్ష
జన్నారం: బీసీ రిజర్వేషన్ల సాధనకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కడార్ల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. విద్య, ఉద్యోగ పదోన్నతులు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కేయూపీఎస్ కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్‌గౌడ్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పొడేటి సతీష్, డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒల్లాల నర్సాగౌడ్, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు