
రాయిపై గణపతి రూపం
భైంసారూరల్: మండలంలోని కోతల్‌గాం గ్రామ శివారులో ఉన్న గుట్టపై రాతి గణపతి వెలిసింది. బండరాయి కింద గణపతి రూపం కనిపించడంతో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ఆది వారం కోతల్‌గాం గ్రామస్తులు భజనలు చేస్తూ వాయిద్యాలతో వెళ్లి పూజలు నిర్వహించారు.
మొదటగా కాపర్లకు..
గ్రామస్తులు, భక్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఈనెల 18న పశువులు, గొర్రెలు మేపేందుకు కాపర్లు గుట్టపైకి ఎక్కారు. ఆ సమయంలో వర్షం పడింది. వర్షానికి ఓ బండరాయి తడవక పోవడంతో సురేశ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి తోటి కాపర్లను పిలిచాడు. బండరాయి వాన నీటికి తడవకపోవడంతో వారంతా ఆశ్చర్యాని కి లోనయ్యారు. వారికి బండరాయి కింద మరోరాయి గణపతి రూపంలో కనిపించింది. దీంతో గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. బండరాయి కింద గణపతి వెలసిందన్న విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు.