
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో కొనసాగుతున్న 71వ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆదిలాబాద్ మహిళ జట్టు విజేతగా నిలువగా పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా జట్టు విజయకేతనం ఎగురేసింది. ఆదివారం సెమీఫైనల్‌తో పాటు ఫైనల్ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్‌లో ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు వరంగల్ జట్టుతో తలపడింది. పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాతో తలపడ్డారు.
పోటీలతో స్నేహభావం..
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో వివిధ జిల్లా ల క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుప తి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి, ఎస్వోటూజీఎం రాజమల్లు, బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఒలంపిక్ అసోషియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. నారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.