
భైంసాలో రెండిళ్లలో..
భైంసాటౌన్: పట్టణంలో చోరీలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. రెండురోజుల వ్యవధి లో రెండిళ్లలో చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నా యి.. మహారాష్ట్రలోని భోకర్ తాలూకా దివిసి గ్రా మానికి చెందిన జోగుదాండే మారుతి భైంసా పట్ట ణంలోని సాయినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఇంటి యజమా ని ఆయనకు సమాచారమిచ్చాడు. దీంతో మారుతి వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండున్నర తు లాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితుడు వాపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. కాగా గీతానగర్‌లోని మరో ఇంట్లో అద్దెకు ఉంటున్న విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హంపోలి గ్రామానికి చెందిన విశ్వనాథ్ గురువారం ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఇంటి పక్కవారు అతనికి సమాచారమిచ్చారు. అతను అక్కడకు చేరుకుని చూడగా, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఈ ఘటనలో తులంన్నర బంగారం, 10 తులాల వెండి, రూ.5వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.