
రూ.80 వేల నష్టం..
భారీ వర్షాలతో ఎర్రవాగు ఉప్పొంగడంతో వరద చేనులోకి వచ్చి మూడు ఎకరాల పత్తి పంటలో ఇసుక మేటలు వేసింది. ఇప్పటి వరకు రూ.80 వేలు ఖర్చు చేసిన. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కొట్రంగి మనోహార్, గ్రామం: జజ్జరవెల్లి,
మం: కన్నెపల్లి
బురదపాలైన పెట్టుబడి..
మూడు ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన.. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎదిగే దశలో ఉన్న పత్తి పంట నీట మునిగింది. రెండు ఎకరాలు ఎల్లారం వాగు ఉప్పొంగడంతో బురదలో కూరుకుపోయింది. మట్టి దిబ్బలతో మొక్కలు బురదలో ఉండి మురి గిపోతోంది. పంట నష్ట పరిహారం అందించాలి.
– గద్దల క్రిష్ణ, గ్రామం: జన్కాపూర్,
మం: కన్నెపల్లి

రూ.80 వేల నష్టం..