
ఇళ్లకు పరిహారం అందించాలి
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి పీపీ రా వు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ చేరి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట పొలాలు, ఇళ్లు మునిగి పరిహారం అందక అనేక అవస్థలు పడుతున్నాం. కొందరికి, లీడర్లకు మాత్రమే పరిహారం ఇచ్చి మాకు అన్యాయం చేశారు. మేము ఆ నీటిలో మునిగి చనిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికై నా అధికారులు మా కాలనీకి వచ్చి పరిశీలించి న్యాయం చేయాలి.
– కన్నెపల్లి మండలం సాలిగాం ముంపుకాలనీవాసులు