
ఆర్టీసీ కానిస్టేబుళ్లకు శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో సోమవా రం ఆర్టీసీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. 51వ తెలంగాణ ఆర్టీసీ కానిస్టేబుళ్ల రిఫ్రెషర్ కోర్సు ను బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కానిస్టేబుళ్లు కూడా ప్రతీ రోజు డ్రిల్, క్రమశిక్షణతో ఉద్యోగం చేస్తూ సంస్థకు మంచి పేరు తీసుకువరావాలని అన్నారు. శిక్షణ అసిస్టెంట్ కమాండెంట్ కాళిదాసు, సీఐ రవీందర్, ఆర్‌ఐలు భాస్కర్, సతీశ్, అన్నయ్య, బెటాలియన్ అధికారులు, శిక్షణ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.