
కొత్త ప్లాంటు పనులపై సమీక్ష
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో డైరెక్టర్(ఈఅండ్‌ఎం) డీ.సత్యనారాయణరావు పర్యటించారు. మంగళవారం ఎస్టీపీపీ ప్రాణహిత గెస్ట్‌హౌస్‌లో అధికారులతో 800 మెగావాట్ల ప్లాంటు ప నులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో మూడో యూని ట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని అన్నారు. మిథనాల్ ప్లాంటు నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరి తగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్లాంటు పరిసరాల్లో సీబీఎస్‌ఈ స్కూల్ ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి, హెచ్‌వోడీ(పీపీడీ) కే.విశ్వనాథరాజు, జీఎం(ఎస్టీపీపీ) శ్రీనివాసులు, జీఎం(పీసీఎస్, ఓఅండ్‌ఎం) నరసింహరావు, ఏజీఎం(ఫైనాన్స్) మురళీధర్, ఏజీఎం(ఈఅండ్‌ఎం) మదన్‌మోహన్, ఏజీఎం(సోలార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్‌కు ఘన సన్మానం
శ్రీరాంపూర్: సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) డీ.సత్యనారాయణరావును ఏరియా అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ నెలాఖరుతో రిటైర్డ్ కాబోతున్న ఆయన మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించిన సందర్భంగా సన్మానం చేశారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, వర్క్‌షాప్ డీజీఎం రవీందర్, అధికారులు పాల్గొన్నారు.