
‘ఎల్లంపల్లి’కి వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామ శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 14టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 11,500 క్యూసెక్కుల, ఎగువ ప్రాంతాల నుంచి 7,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 330 క్యూసెక్కులు, ఎస్టీపీపీకి 121 క్యూసెక్కులు వదులుతున్నారు.
నేడు పాఠశాలలకు సెలవు
మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల వాతావరణ సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సెలవు పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.