
ఎరువుల కోసం బారులు
చెన్నూర్/కోటపల్లి: ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. చెన్నూర్ ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద రైతులు ఎరువుల కోసం ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళా రైతులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. 4గంటలకు ఒక లారీ ఎరువులు వచ్చినా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. ఎరువులు పంపిణీ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని చెల్లాయిపేటకు చెందిన రైతు మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటపల్లిలో బుధవారం యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయాన్నే రైతువేదిక వద్ద బారులు తీరారు. ఏడీఏ ప్రసాద్ యూరియా బస్తాలు అందజేశారు. యూరియా లభిస్తుందో లేదోననే బెంగతో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో తోపులాట జరిగింది.