
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జన్నారం: ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహనాల రాకపోకలను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్‌తో కలిసి ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భారీ వాహనానికి అటవీశాఖ ఇస్తున్న రూ.150 రశీదును లారీ యజమానికి అందజేశారు. అనంతరం జన్నా రం వరకు లారీలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, అటవీశాఖ అధికారులు ఎమ్మెల్యే ను సన్మానించారు. మండల కేంద్రంలోని అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాకపోకలపై నిషేధం ఎత్తివేతకు కృషి చేస్తానని ఏడాది క్రితం హామీ ఇచ్చానని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైల్డ్‌లైఫ్ బోర్డు స మావేశంలో అధికారులపై ఒత్తిడి తెచ్చానని, చివరికి రాకపోకలపై నిషేధం ఎత్తివేయడం శుపరిణా మమని అన్నారు. పగటిపూట రాకపోకలు సాగించే వాహనాల డ్రైవర్లు, యజమానులు అటవీ శాఖ ని బంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అతివేగంగా వెళ్లి వన్యప్రాణులకు హాని కలిగించవద్దని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు అనవసర ఆరోపణలు చేశారని అన్నారు. రేంజ్ అధికారి సుష్మారావు, డీఆర్వో సాగరిక, ఎస్సై అనూష, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మ న్ ఫసీఉల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముజా ఫర్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, నాయకులు ఇసాక్, శంకరయ్య, రియాజోద్దీన్, శాఖీర్‌అలీ, ముజ్జు, స్వామి, అజార్ పాల్గొన్నారు.