
‘వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలి’
పాతమంచిర్యాల: ఇంగ్లండ్, అమెరికాలతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని అఖిల భారత కేత్ మజ్ధూర్ సంఘ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్‌కుమార్ అన్నారు. బుధవారం బహుళ జాతి కంపెనీల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుపతి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంకె రవి, ఉపాధ్యక్షుడు చందు పాల్గొన్నారు.