
బహుజన రాజ్య స్థాపననే లక్ష్యం
పాతమంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించడమే లక్ష్యమని డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఎసీ ఆవిర్భావ సభకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల రాజ్యాన్ని కూల్చి బహుజన రాజ్యం నిర్మించడం కోసమే మా భూమి రథయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచి రాజకీయ చైతన్యాన్ని బహుజనుల్లో నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎదునూరి రమేష్, సదానందం, సుదమళ్ల హరికృష్ణ, పడాల రామన్న, జెఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ పాల్గొన్నారు.