
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం, సౌకర్యార్థం ప్రతీ జిల్లాలో పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, 24 గంటలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో విద్యుత్, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి