
భూ సమస్యలు పరిష్కరించాలి
భీమిని: భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం ఆయన కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. భూ భారతిలో మండలంలో దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని పెండింగ్ సమస్యలపై విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని తెలిపారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య, సిబ్బంది పాల్గొన్నారు.