
‘అత్యవసర సేవకులే కాదు.. ప్రాణదాతలు’
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు అంతరాయం లేకుండా అందిస్తున్న అత్యవసర సేవకులే కాదు.. రక్తదానం చేసి ప్రాణదాతలు కూడా అయ్యారని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే అ న్నారు. మంగళవారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమి యా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల సహాయర్థం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్తనిధి కేంద్రానికి ప్రతీ సంవత్సరం విద్యుత్ శా ఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కే.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తనిధి కేంద్రంలో నిల్వలు అట్టడుగు స్థాయికి చేరా యని, స్వచ్ఛంద సేవాసంస్థలు, యువత ముందుకు రావాలని తెలిపారు. జేఏసీ చైర్మన్ సత్తిరెడ్డి, రమేష్, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఏడీఈ మోహన్‌రెడ్డి, రాజశేఖర్, రవికుమార్, కాటం శ్రీనివాస్, శరత్, ఏఈ మంచాల శ్రీరివాస్, క్రిష్ణ పాల్గొన్నారు.