
కేంద్రం చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలి
కోటపల్లి: కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి పనులను ఇంటింటా వివరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని సిర్సాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దుర్గం అశోక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, ఆయుష్మాన్ భారత్, సుకన్య యోజన, ఉజ్వల గ్యాస్ సిలిండర్ పథకాలు కేంద్రం నిధులతో చేపట్టినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు స్వప్న, నాయకులు మంత్రి రామ య్య, పున్నం, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.