జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామ పాలన అధికారులకు ఆదివారం రాత పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్, అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించా రు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తె లిపారు. లోటుపాట్లకు, అవకతవకలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగే విధంగా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పరీక్షకు జిల్లాల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాల తరలింపు, స్ట్రాంగ్ రూమ్, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు తెలుసుకునేలా అధికారులను ఆదేశించామన్నారు. వీసీలో ఆర్డీవో శ్రీని వాస్‌రావు, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా, విద్యాశాఖ పరిశీలకులు సత్యనారాయణ, ముఖ్య పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


