గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జైపూర్: మండలంలోని టేకుమట్ల రోడ్డు సమీపంలో ఇందారం ప్లాంటేషన్ వద్ద గంజాయి విక్రయించేందుకు వచ్చిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రాటే నగేశ్, చౌతాకారి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పై శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నగేశ్, శ్రీకాంత్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు బైక్‌పై వెళ్లి అక్కడి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేస్తుంటారు. అందులో కొంత సేవించి మిగతా దా న్ని ప్యాకెట్లుగా చేసి రూ.500 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ జల్సా చేసేవారు. ఈ క్రమంలో అక్కడ గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేందుకు తెస్తుండగా సోమవారం వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలి పారు. వారి నుంచి 102 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


