
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్‌కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులతో పాటు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. నిర్దిష్ట ప్రణాళిక, ఉన్నతమైన బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాబోయే అడ్వాన్డ్స్ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించి పేరొందిన ఐఐటీ సంస్థల్లో తమ విద్యార్థులు సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.