
విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న గుడ్లగూబ
కాగజ్‌నగర్ రూరల్: అనారో గ్యంతో మూడురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు మృతి చెందారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్ర కారం.. పట్టణంలోని చారి గాం రోడ్డుకు చెందిన ఆశ కా ర్యకర్త అఫ్సానా భాను (40) పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ మూడురోజుల క్రితం మృతిచెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె భర్త అశ్రఫ్ (45)కు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, సరైన చికిత్స అందక శుక్రవారం మృతిచెందాడు. మూడురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గుండ్లగూబకు విద్యుద్ఘాతం.. సరఫరాలో అంతరాయం
వేమనపల్లి: గుడ్లగూబ విద్యుద్ఘాతానికి గురై మృతి చెందగా మండల కేంద్రంలో విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. గురువారం రాత్రిపూట గుడ్లగూబ ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభంపై వాలింది. పక్కనే ఉన్న మరో విద్యుత్ తీగకు తగలడంతో విద్యుద్ఘాతమై స్తంభంపైనే ఉండిపోయింది. మండల కేంద్రానికి తెల్లవారుజాము వరకు లోఓల్టే జీ, హైఓల్టేజీ అంతరాయం కలిగింది. గ్రా మంలోని కూలర్లు, ఫ్యాన్లు, రెండు ఫ్రిజ్‌లు చెడిపోయాయి. సరఫరా నిలిచిపోయి పలువురు ఉక్కపోతతో సతమతం అయ్యారు. తెల్లవారుజామున రో డ్డు వెంట వెళ్తున్న పాదచారులు గమనించి విష యం సబ్‌స్టేషన్‌కు చేరవేశారు. స్తంభంపై ఉన్న గుడ్లగూబను తీసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
నియామకం
పాతమంచిర్యాల: మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా కొప్పుల రాజారాంను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు ముత్యమాల పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

షేక్‌అశ్రఫ్, అఫ్సానా భాను