ఫ్లెక్సీ కట్టేందుకు వెళ్లి మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ కట్టేందుకు వెళ్లి మృత్యువాత

Nov 28 2026 12:50 AM | Updated on Nov 28 2026 12:50 AM

మణికొండ: కాలనీలో శనివారం జరిగే అయ్యప్ప మహాపడిపూజ ఫ్లెక్సీని కట్టే క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మణికొండ క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలం, కల్వరాల గ్రామానికి చెందిన ఉదయ్‌(22) కుటుంబం బతుకుదెరువు కోసం మణికొండకు వచ్చి స్థిరపడింది. అతను బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. శనివారం మణికొండ క్వార్టర్స్‌ కాలనీలో అయ్యప్ప మహాపడిపూజ ఉండటంతో తన మిత్రుడు ఫ్లెక్సీ కడదామని పిలవడంతో వెళ్లాడు. క్వార్టర్స్‌ బస్‌స్టాప్‌ వద్ద కడుతున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇనుప రాడ్‌ తగలడంతో విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్‌లు ధ్రువీకరించారు. దాంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియలు కల్వరాలలోనే శనివారం నిర్వహిస్తామని ఆ గ్రామ సర్పంచ్‌ మహాదేవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement