పెద్దకొత్తపల్లి: భూ తగాదాలో దోషులుగా తేలిన ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, రూ. 24 వేలు జరిమానా విధిస్తూ కొల్లాపూర్‌లోని ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి దమ్ము ఉపనిషద్వానీ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. 2021లో మండలంలోని దేదినేనిపల్లి శివారులో అంబటిపల్లి గ్రామ నివాసులైన పడిగే శేషయ్య, పడిగే చిన్న నారాయణ, పడిగే శివుడు, నెక్కిలి సుధాకర్, మేకల వెంకటయ్య ఐదుగురు కలిసి భూమి పంచాయితీ, పాత కక్షలు మనుసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన వెన్నచర్ల బాలాపీర్, వెన్నచర్ల నరసింహా, వెన్నచర్ల జనానందం కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కానిస్టేబుల్ రాముడు, రాజవర్దన్ సాక్షులను కోర్టులో హాజరు పర్చగా ఏపీపీ శిరీష వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కొల్లాపూర్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దోషులకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
పోలేపల్లి సెజ్‌లో ఉద్యోగి హఠాన్మరణం
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్‌లోని సుప్రీం పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పల్లె చెన్నయ్య(34) శుక్రవారం గేటు వద్ద తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మార్గమధ్యంలో గుండెపోటుకు గురై మృతిచెందినట్లు కటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే అస్వస్థతకు గురైన వెంటనే అంబులెన్స్‌లో ఆక్సీజన్ అందించి ఆస్పత్రికి తరలించి ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని.. అలా చేయకుండా పరిశ్రమ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. గంటల తరబడి ఆందోళన చేపట్టినా పరిశ్రమ అధికారులు, బాధ్యులు ఎంతమాత్రం స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఉన్నా.. పరిశ్రమ నిర్వాహకులు స్పందించక పోవడంతో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాచారం నుంచి పరిశ్రమ వద్దకు కారు తీసుకొచ్చి జడ్చర్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని, సకాలంలో ఆస్పత్రికి తరలించక ఆలస్యం జరగడంతోనే మృతిచెందాడని పేర్కొన్నారు. మృతుడు మండలంలోని మాచారం గ్రామానికి చెందినవాడు కావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. విషయాన్ని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడినట్లు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే సూచన మేరకు మృతుడి కుటుంబానికి రూ.10లక్షలు సహాయంగా అందజేసేందుకు పరిశ్రమ నిర్వాహకులు అంగీకరించారన్నారు. మృతుడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఏటీఎం వాహనం ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లాలోని కొత్తకోట పట్టణంలో ఈ నెల 19న బొలెరో వాహనం ఢీకొని 4వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన సుమిత్ర, ర మేష్ దంపతుల కుమారుడు పవన్ కొత్తకోట లోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువు తూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 19న మధ్యాహ్న భోజన సమయంలో పాఠశా ల టీచర్ పెరుగు పాకెట్ తీసుకురావాలని చెప్పడంతో పవన్ రోడ్డు దాటుతుండగా వనపర్తి నుంచి కొత్తకోటకు ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పంది ంచి 108 అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవా లని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్ర.ం తెలిపారు.


