కందనూలు: తెలకపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల విద్యార్థి ఆర్.ప్రభాస్ అత్యాపత్య పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు కోరుట్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈక్రమంలో జనవరి 8 నుంచి 10 వరకు లక్నోలో జరిగే జాతీయ పోటీల్లో ప్రభాస్ పాల్గొననున్నాడని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ మల్లేష్, అసోసియేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.


