మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. ఖమ్మం జిల్లా బెల్లంపల్లిలో నేటి (శనివారం) నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–17 నెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లు శుక్రవారం తరలివెళ్లాయి. ఉమ్మడి జిల్లా జట్లను ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ అభినందించారు. విద్యార్థులు పట్టుదల, సమష్టిగా ఆడితే క్రీడల్లో విజయాలు సాధించవచ్చని అన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్వప్న, రాంమోహన్, ఖాజాఖాన్, సనిత తదితరులు పాల్గొన్నారు.


