లాడ్జీలలో రిజిస్టర్లు దోచి.. నకిలీ బంగారంతో టోకరా | - | Sakshi
Sakshi News home page

లాడ్జీలలో రిజిస్టర్లు దోచి.. నకిలీ బంగారంతో టోకరా

Nov 26 2026 1:05 AM | Updated on Nov 26 2026 1:05 AM

కామారెడ్డి టౌన్‌: లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు ఎత్తుకెళ్లడమే కాకుండా..వాటిలోని ఫోన్‌ నంబర్ల ఆధారంగా తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం. రాజేశ్‌చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు దుండగులు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట అక్షయ గ్రాండ్‌ లాడ్జీ మేనేజర్‌ను స్క్రూ డ్రైవర్‌తో బెదిరించి రూ.10 వేల నగదు, రిజిస్టర్లను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి పట్టణ శివారులోని ఎంట్రన్స్‌లో ఆపరేషన్‌ కవాచ్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా నిందితులు పట్టుబడ్డారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా, హోస్పేట్‌కు చెందిన మాచిహళ్లి మారుతి (32), చక్రి పరశురామ్‌ మాదిగ (25), అభిషేక్‌ కవ్వాడి (21), వెంకటేశ్‌ సట్పాడి (25), సంతోష్‌ సట్పాడి లక్ష్మప్ప (32) ముఠాగా గుర్తించారు.

కస్టమర్లతో నకిలీ బంగారంతో దందా

కర్ణాటకలో టూర్‌ కోసమని అద్దెకు తీసుకున్న క్రెటా కారులో తెలంగాణకు వచ్చి గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్‌, కొత్తూరు, హైదరాబాద్‌, చందానగర్‌, సంగారెడ్డి, నర్సాపూర్‌, కామారెడ్డి ప్రాంతాల్లోని లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లను దోచుకున్నారు. ఆ రిజిస్టర్లలోని కస్టమర్ల ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి, వారు గతంలో బస చేసిన తేదీలు, ఆధార్‌ వివరాలు చెప్పి నమ్మించేవారు. తమకు తవ్వకాల్లో భారీగా బంగారం లభ్యమైందని, తెలిస్తే ప్రభుత్వం తీసుకుంటుందని నమ్మబలికి, తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని ఆశచూపి, మొదట అసలు బంగారం కొద్దిగా శాంపిల్‌ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. ఆ తర్వాత నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి భారీగా డబ్బు వసూలు చేసేవారు. అలాగే కర్ణాటకకు అమాయకులను రప్పించుకొని ప్లాన్‌ ప్రకారం భారీగా డబ్బును దొచుకునేవారు. నిందితుల నుంచి రూ.8,500 నగదు, క్రెటా కారు, 25 లాడ్జీ రిజిస్టర్లు, 10, 2, 1, అర తులాల బరువు గల 4 నకిలీ బంగారు బిస్కెట్లు, ఒక స్క్రూడ్రైవర్‌, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

ఐదుగురు అంతర్రాష్ట్ర

ముఠా సభ్యుల అరెస్ట్‌

క్రెటా కారు, 25 రిజిస్టర్లు,

నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం

ఆపరేషన్‌ కవాచ్‌కు చిక్కిన

కర్ణాటక దోపిడీ ముఠా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement