కొత్తపల్లి: పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం మధ్యా హ్నం చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. కోయిల్‌కొండ మండలం ఖా జీపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి (30) దామర గిద్దలో పెళ్లి ఉండ డంతో ద్విచ క్రవాహనంపై బయలుదేరాడు. నిడ్జింత శివా రులోకి రాగానే మద్దూరు నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురు గా ఢీకొట్టాడు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గా యాలు కాగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించా రు. అయితే పరిస్థితి విషమించడంతో మార్గ మ ద్యలో మరణించాడు. మద్యం మత్తులో వాహనం నడప డంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. యువకుడి మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చే స్తామని మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ వెంకటేష్ కథనం ప్రకారం.. హనుమాన్‌పురాకు చెందిన శివప్రసాద్ (23) అర్ధరాత్రి బైక్‌పై క్రిస్టియన్‌పల్లి నుంచి బండమీదిపల్లికి బయలుదేరాడు. చించోళి బైపాస్ మార్గంలో పీయూ బ్రిడ్జి సమీపంలో ముందు వెళ్తు న్న గుర్తు తెలియని వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. యువకుడికి నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం భార్య వెంకటేశ్వరమ్మ ఉందని ఎస్‌ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


