కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా జిల్లాలో డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, రవాణా, భద్రత, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

వసతి, రవాణాకు ప్రాధాన్యం

క్రీడాకారులు, సహాయక సిబ్బంది, అధికారుల సంఖ్యకు అనుగుణంగా హోటళ్లలో గదులను ఖ రారు చేయాలని, అందుబాటులో ఉన్న వసతి సా మర్థ్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వసతి కేంద్రాల నుంచి ఇండోర్‌ స్టేడియానికి రాకపోకల కోసం ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయాలన్నారు.

స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇండోర్‌ స్టేడియంలో మరమ్మతులు, విద్యుత్‌, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల పనులను గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

వైద్య, భద్రత ఏర్పాట్లు

క్రీడాకారుల కోసం ప్రత్యేక వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. స్టేడియం, వసతి కేంద్రాలు, రవాణా మార్గాల్లో పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, ప్రచార పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విభాగానికి ఇన్‌చార్జిలను నియమించి రోజువారీ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ సాయి శివాని, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు జాతీయస్థాయి పోటీలు

వసతి, రవాణా, వైద్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి

అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి: కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement