ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

● తుంగభద్ర నుంచి చివరి తడులకు నీటిని విడుదల చేయాలి

● రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో చర్చించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఆర్డీఎస్‌ ఆయకట్టు పరిధిలో పంటలకు చివరి తడుల కోసం తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో ఆర్డీఎస్‌ ఆనకట్టలో నీటి నిల్వలు అడుగంటాయని తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 12 నుంచి 22వ డిస్ట్రిబ్యూటరీ గ్రావిటీ కెనాళ్ల పరిధిలోని సుమారు 10 వేల ఎకరాలకు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద మరో 10 వేల ఎకరాలకు చివరి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించాలని కోరారు. కనీసం రెండు తడులకై నా నీరు అందించి పంటలను కాపాడాలని, తెలంగాణకు హక్కుగా రావాల్సిన జలాలను పొందేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ హన్వాడ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, నాయకులు బండారి ప్రభాకర్‌, క్రాంతి, మఖ్సూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement