అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన.. 62 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన.. 62 మంది హాజరు

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం బుధవారం మహబూబ్‌నగర్‌ నగరంలోని సీఐడీ కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రత్యేక బృందం అధికారులు బాధితుల బాండ్లను పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. తొలిరోజు అడ్డాకుల మండలం నుంచి 250 మంది హాజరుకావాల్సి ఉండగా 62 మంది మాత్రమే వచ్చారు. వీరికి సంబంధించిన 92 బాండ్లు, రెండు చెక్కులను అధికారులు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గురువారం అడ్డాకులతో పాటు బాలానగర్‌ మండలానికి చెందిన బాధితుల బాండ్లను పరిశీలించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బాదేపల్లి యార్డుకు భారీగా ధాన్యం రాక

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా పంట దిగుబడులు వచ్చాయి. వరి ధాన్యం 26,492 బస్తాలు విక్రయానికి రాగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,909, కనిష్టంగా రూ.2,216 ధర పలికింది. మొక్కజొన్న 238 బస్తాలు రాగా రూ.3,133 నుంచి రూ.2,913 వరకు, వేరుశనగ 1,417 బస్తాలు రాగా రూ.9,701 నుంచి రూ.7,391 వరకు ధరలు లభించాయి. ఆముదాలకు రూ.7,375, మినుములకు రూ.9,551, కందులకు రూ.8,979 ధర పలికింది. పత్తికి గరిష్టంగా రూ.9,089, కనిష్టంగా రూ.7,979 ధర లభించింది.

నేడు సెలవు

యార్డుకు బుధవారం భారీగా పంట దిగుబడులు రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయిందని మార్కెట్‌ కార్యదర్శి అశ్వక్‌ అహ్మద్‌ తెలిపారు. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను సకాలంలో తరలించలేకపోవడంతో గురువా రం మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి యథాతథంగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని, రైతులు గమనించాలని కోరారు.

ఉత్సాహంగా ఖోఖో

క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలోని కోయిలకొండ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 ఉమ్మడి జిల్లా బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో దాదాపు 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. టీజీపీడీ పీఈటీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్‌, ఎంఈఓ మిన్హాజ్‌, సర్పంచ్‌ సుజాత ఆనంద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌, పాఠశాల ఇన్‌చార్జీ హెచ్‌ఎం శివకుమార్‌, సెలక్షన్‌ కన్వీనర్‌ పీడీ మొగులాల్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement