రాజగోపురం వద్ద భక్తుల రద్దీ
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు కోనేటి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిల్చున్నారు. మెట్లపై దీపా లు వెలిగించి గోవింద నామస్మరణలు చేశా రు. అనంతరం కొండపైన అలువేలుమంగమ్మ అమ్మవారు, ఆంజనేయ స్వామి, చెన్నకేశవస్వా మి,ఉద్దాల మండపాలను దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన మట్టికుండలో దాసంగాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గండదీపాలు మోసి మొక్కుకున్నారు. అనంతరం జాత ర మైదానంలోని అంగళ్లలో వివిధ రకాల వస్తువులను కొనుగోళ్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ బత్తుల బాల్‌రాజు, కమిటీ సభ్యులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు.


