లబ్ధిదారుడి ఇంటికి వెళ్లిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారుడి ఇంటికి వెళ్లిన అధికారులు

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

పాన్‌గల్‌: ‘చూపు లేదు.. పింఛన్‌ లేదు’ అనే శీర్షికన గురువారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ గోవింద్‌రావు, పంచాయతీ కార్యదర్శి కుర్మన్న మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో నివసిస్తున్న కృష్ణానాయక్‌ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. లబ్ధిదారుడి ఇంటి వద్ద నుంచే ఎంపీడీఓ ఫోన్‌ ద్వారా కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. సదరం ధ్రువపత్రంతో పాటు ఇతర వివరాలను పరిశీలించగా కృష్ణానాయక్‌ పింఛన్‌కు అర్హుడని గుర్తించినట్లు ఎంపీడీఓ తెలిపారు. సేకరించిన వివరాలను కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఆర్‌డీఓకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. తమ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కథనం ఇచ్చి, పింఛన్‌ అందేందుకు కృషి చేసిన ‘సాక్షిశ్రీకి బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement