మినీ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ.. 9 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

మినీ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ.. 9 మందికి గాయాలు

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

వనపర్తి రూరల్‌: మినీ ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో 9 మంది గాయపడిన ఘట న పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని కృష్ణానది వంతెనపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన బడె అనిల్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న కర్నూలుకు వెళ్లారు. అక్కడ మేనకోడలు నైనిషా వివా హ రిసెప్షన్‌కు హాజరై, గురువారం మధ్యాహ్నం ప్రైవేట్‌ మినీ ట్రావెల్స్‌ బస్సులో కరీంనగర్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రంగాపురం శివారులోని కృష్ణానది వంతెనపై బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. వెనుక నుంచి మరో లారీ కూడా ఢీకొనడంతో వాహనా లు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తొమ్మిది మంది క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. క్రేన్‌ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బాధితుడు అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement