ప్రజల జీవితాల్లో మార్పు కోసమే తాపత్రయం | - | Sakshi
Sakshi News home page

ప్రజల జీవితాల్లో మార్పు కోసమే తాపత్రయం

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఎన్నికల కోసం ఆరాటపడటం కాదు.. భావితరాల భవిష్యత్‌కు బంగారుబాటలు వేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసిన పనులే చరిత్రలో నిలిచి పోతాయన్నారు. మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అర్హులైన 2,240 మంది వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను సోమవారం స్థానిక శిల్పారామంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అలాగే నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వజ్రకుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌జీ, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement