మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తాం

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

మక్తల్‌: మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో మినిస్టర్‌ కప్‌ 2026–27 సీజన్‌–1 క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం రూ.600 కోట్లు కేటాయించిందన్నారు. క్రీడా రంగంలో మక్తల్‌కు ప్రత్యేకత ఉందని.. ప్రస్తుతం నిర్వహిస్తున్న మినిస్టర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, బీహర్‌ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించే గొప్ప వేదికలు అని అన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ ప్రియాంకతో కలిసి క్రీడా మైదానాన్ని మంత్రి పరిశీలించారు. మైదానం అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని వసతులతో స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. స్టేడియం నిర్మాణానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇండోర్‌ స్టేడియం భవనాల తొలగింపుపై కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement