పట్టువస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

పట్టువస్త్రాల సమర్పణ

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

అమరచింత: కురుమూర్తిస్వామి ఆభరణాల అలంకారోత్సవం సందర్భంగా అమరచింత భక్తమార్కండేయ ఆలయంలో పద్మశాలీలు నేసిన పట్టువస్త్రాలను ఆత్మకూరుకు మేళతాళాల మధ్య ఊరేగింపుగా తరలించారు. మంత్రి వాకిటి శ్రీహరి పట్టువస్త్రాల తరలింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పట్టువస్త్రాలను తలపై మోస్తూ ముందుకు కదిలారు. ఆత్మకూర్‌ ఎస్‌బీఐ వద్ద స్వామివారి ఆభరణాలతో కలిపి మరోమారు పూజలు నిర్వహించి అక్కడి నుంచి అమ్మాపురం తీసుకెళ్లి స్వామివారి ఆలయంలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సువర్ణ, కౌన్సిలర్లు రాజు, ఊశన్న, విష్ణు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు భాస్కర్‌, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రఘురాం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement