పాలమూరులో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో హైకోర్టు న్యాయమూర్తి

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

పాలమూరు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత, ఎస్పీ డి.జానకి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన గద్వాల జిల్లాకు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement