కాంట్రాక్టు కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, సూపర్‌వైజర్‌ కార్మికులు చేపట్టిన ఆందోళన మూడోరోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం చేతిలో చిప్పలతో భిక్షాటన చేసి యాచకులుగా వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్‌ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపు కోసం ప్రత్యేక సమావేశాల్లో శాసనాలు చేస్తారు.. కాని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్నివిధాలా సేవలు చేసే వారి వేతనాల పెంపును పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కనీస వేతన బోర్డు సూచనలను పక్కనబెట్టి జీవోలను సవరించి మూడు జోన్లుగా, నాలుగు కేటగిరీలుగా విభజించి కనీస వేతాలను అశాసీ్త్రయంగా రూ. 14 వేల నుంచి రూ.20 వరకు పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. కాలం చెల్లిన కాంట్రాక్టు ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గోపాల్‌నాయక్‌, బుచ్చన్న, రంగన్న, బి.చెన్నయ్య, బాలకోటి, వసంత, పద్మ, సత్యమ్మ, నాగమణి, చంద్రకళ, అలివేల, నిర్మల, మమత, మంజుల, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement