భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

చిన్నచింతకుంట: కురుమూర్తి జాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నయాక్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి ఆలయం వద్ద జారత ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జాతరలోని పలు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి జాతర కు లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ సరఫ రా, వైద్యసేవలు, ట్రాఫిక్‌ నియంత్రణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎల్లయ్య, ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement