పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక చర్యలు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతి మండలంలో ఒక ఆదర్శ రైతును ఎంపిక చేసి, వారి ద్వారా ఉద్యాన పంటలు, ప్రకృతి వ్యవసాయం, బయోఫార్మింగ్‌పై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గతంలో 650 ఎకరాల నుంచి ప్రస్తుతం 3,160 ఎకరాలకు పెంచామని, యాసంగిలో మరో 1,200 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాలు అందించి సాగుకు సహకరిస్తే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహించవచ్చన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ సంజయ్‌ జాజు మాట్లాడుతూ ఎల్‌నినో, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని యాసంగి పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కూరగాయలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసి రైతులకు సకాలంలో అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, హరిప్రియ, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌నాయక్‌, ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి బీమా భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే, రేషన్‌ కార్డుల వివరాలతో లబ్ధిదారులను గుర్తించాలని, రేషన్‌ కార్డులు లేని కుటుంబాలనూ పరిశీలించాలని సూచించారు. ఈ నెల 14 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

కూరగాయల సాగు 650 నుంచి 3,160 ఎకరాలకు పెంపు

యాసంగిలో మరో 1,200 ఎకరాల్లో సాగు లక్ష్యం

రైతులకు ఉచిత విత్తనాల పంపిణీకి కార్యాచరణ: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement