గజవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు | - | Sakshi
Sakshi News home page

గజవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు పద్మావతిదేవి సమేతంగా గజవాహనంపై ఊరేగారు. కురుమూర్తి కొండల్లో స్వామివారి సేవ అత్యంత వైభవంగా కొనసాగింది. మంగళ వాయిద్యాలు, అర్చకుల వేదమంత్రాల నడుమ పల్లకీలో ఆశీనులైన స్వామివారు ఒంటిపాదం మెట్టు వరకు విహరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీనివాసుడి గజవాహన సేవను తిలకించి.. తరించారు. కార్యక్రమం కొనసాగినంత వరకు కురుమూర్తిరాయుడు కొలువుదీరిన ఏడుకొండలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యలు తదితరులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement