బ్రహ్మోస్‌తో దేవరకద్రకు ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్‌తో దేవరకద్రకు ఉజ్వల భవిష్యత్‌

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● భూ నిర్వాసితులకు

రూ.32.46 కోట్ల పరిహారం

● ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం: జీఎమ్మార్‌

దేవరకద్ర రూరల్‌: బ్రహ్మోస్‌ మిస్సైల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుతో దేవరకద్ర ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బస్వాయపల్లి, జీనుగురాల గ్రామాలకు చెందిన 89 మంది భూ నిర్వాసిత రైతులకు రూ.32.46 కోట్ల పరిహారం చెక్కులను తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాజెక్టును దేవరకద్రలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులతో కృషి చేసినట్లు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న కుటుంబాలకు ఉద్యోగావకాశాల్లో తొలి ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యూనిట్‌ పూర్తయితే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహ్మద్‌ హర్షద్‌, కమిషనర్‌ నరేష్‌బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement