సీపీఎస్‌ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆపేది లేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కేఎం. చంద్రకాంత్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ 17న నిర్వహించనున్న శాంతియుత ధర్మదీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అదనపు కలెక్టర్‌ హరిప్రియకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు రాజేష్‌, కార్యదర్శి షంషీర్‌, మానస, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement